చేగుంట[chegunta] జనవరి 31,సిరి న్యూస్
మెదక్[medak] జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు, గురువారం రాత్రి జరిగిన వేడుకల్లో త్రిదండి చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు, స్వామివారిని ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, అనంతరం చిన జీయర్ స్వామి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రవచనాలు వినిపించారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేగుంట ఎస్సై శ్రీ చైతన్య కుమార్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు,