కౌడిపల్లి[Kaudipalli] జనవరి 21 (సిరి న్యూస్)
మెదక్[medak] జిల్లా గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షులుగా చంద్రం కృష్ణ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు యేలికట్టే విజయ్ కుమార్ అధ్యక్షత న నిర్వహించగా అందులో మెదక్ జిల్లా అధ్యక్షుడిగా కౌడిపల్లి గ్రామానికి చెందిన చంద్రం కృష్ణ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన చంద్రం కృష్ణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం తమకపైన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ,జిల్లా గౌడ సంఘం సభ్యులకు అందుబాటులో ఉండి సంఘం సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు .