మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.
జీడిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ
రూ.12లక్షలతో సీసీకెమెరాలను ఏర్పాటు చేయించిన వెంకటరమణ దంపతులను అభినందించిన ఎస్పీ
మనోహరాబాద్. జనవరి 5 సిరి న్యూస్ : శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణ కోసం సీసీ కెమెరాలు (CC Camara) ఎంతో ఉపయోగపడుతున్నాయని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి (Medak District SP Uday Kumar Reddy) తెలిపారు. మండలంలోని జీడిపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన వెంకటరమణ దంపతులు వారి తల్లిదండ్రులైన మే, అనంతరాములు, సోదరుడు విజయ ప్రసాద్ జ్ఞాపకార్థం జీడిపల్లి తో పాటు మధిర గ్రామమైన గొల్లపల్లి లో రూ. 12 లక్షల సొంత ఖర్చుతో 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఆదివారం మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి, సీఐ రంగకృష్ణ, స్థానిక ఎస్సై సుభాష్ గౌడ్ లతో కలిసి ఎస్పీ స్థానిక గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సి సి ఫుటేజ్ లను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న జీడిపల్లి గ్రామం దినదినముగా అభివృద్ధి చెందడంతో పాటు పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడంతో ఇతర రాష్ట్రాల కార్మికులు ఇక్కడికి వచ్చి పనులు చేస్తుంటారని తెలిపారు.
కొంతమంది వ్యక్తులు శాశ్వతంగా ఉన్న మరి కొంతమంది వ్యక్తులు కొన్ని రోజుల పాటు పనులు చేసి గ్రామాల మీద పడి దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడి వెళ్ళిపోతుంటారని అలాంటి వారి జాడ కోసం ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామానికి ఎంతో ఉపయోగపడే ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఎంతో దోహమని వెంకటరమణ దంపతులను ఎస్పీ అభినందించారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మరిన్ని గ్రామాలలో ఇలాంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. శాంతి భద్రతలు అదుపులో ఉండడానికి, దొంగతనాల నివారణ, గ్రామాలలో సంచరించే గుత్తి తెలియని వ్యక్తుల ఆచూకీ ఈ సీసీ కెమెరాల ద్వారా ఎంతో ఉపయోగపడుతుందని గుర్తు చేశారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసుకునే వ్యాపారాలు తప్పనిసరిగా తమ వ్యాపార సంస్థల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు . అలాగే హైవే రోడ్డుపై జరిగే ప్రమాదాలను గుర్తించడానికి తూప్రాన్ డిఎస్పీ, సిఐ, మనోహరాబాద్ ఎస్ఐల ప్రత్యేక చొరవతో 50 కెమెరాలను ఏర్పాటు చేశారని ఎస్పీ గుర్తు చేశారు.