పెద్ద శంకరం పేట, (సిరి న్యూస్):
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటితో 420 రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, స్థానిక బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మహత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నందుకు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పూటకో మాట మారుస్తున్న రేవంత్ రెడ్డి వైఖరి కి నిరసనగా పట్టణం లోని గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్య క్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాజా మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, భూత్కూరి సుభాష్, సొసైటీ వైస్ చైర్మన్ అంజయ్య, మాజీ కోఆప్షన్ యాదుల్ల, మూసాపేట మాజీ సర్పంచ్ నరసింహులు సెట్, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కంచరీ మాణిక్యం, సారా అశోక్, మంగలి శ్రీనివాస్, టెంకటి అశోక్, నాందేడ్ దుర్గయ్య, నాందేడ్ సాయిలు, నగేష్, శనిగరి సాయిలు, హరిజన్ బేతయ్య తదితరులు పాల్గొన్నారు.