మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు బీఆర్ఎస్ నేత‌ల శుభాక్షాంక్ష‌లు

మాజీ ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డి, ఎమ్మెల్సీ క‌విత‌ను క‌లిసిన నేత‌లు

మెద‌క్, జ‌న‌వ‌రి 2(సిరిన్యూస్‌) : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావును కోకపేట్ లోని ఆయ‌న‌ నివాసంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ నాయ‌కులు గురువారం క‌లిసి శుభాక్షాంక్ష‌లు తెలిపారు.

హ‌రీష్‌రావును క‌లిసిన వారిలో మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ ఇంచార్జి కంఠారెడ్డి తిరుప‌తిరెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెళ్ళ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు ,సెక్రటరీ జనరల్ గడ్డమిది కిష్ఠగౌడ్, కౌన్సిల‌ర్లు బీమరి కిషోర్, వంజరి జయరాజ్, సులోచనా ప్రభురెడ్డి ,ఆర్కె శ్రీనివాస్, కసాపురం మధు, యువ నాయకులు మహేష్ యాదవ్, కసాపురం కిరణ్ , రంజిత్ నాయక్ , చెదల అరుణ్, తరుణ్, లడ్డూ తదితరులు పాల్గొన్నారు. అలాగే మెద‌క్ జిల్లా పార్టీ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డిని, ఎమ్మెల్సీ క‌విత‌ను వేర్వేరుగా క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.