బిఆర్ఎస్ కాంగ్రెస్ లు ఉద్యోగులను మోసం చేశాయి..

BRS Congress has cheated the employees..
BRS Congress has cheated the employees..

రిటైర్మెంటైనా బెనిఫిట్స్ ఇవ్వడంలే..
రిటైర్మెంట్ వయసు పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నం..
దీంతో చదువుకున్న యువత నిరుద్యోగులకు నష్టం..
జిల్లాను చార్మినార్ జోన్లో కలిపేందుకు సహకరిస్తా..
టిఎన్జీవో స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ రఘు నందన్ రావ్..

మెదక్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో క్రియాశీలకమని మెదక్ స్థానిక ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం నాడు టిఎన్జిఓలు ఏర్పాటు చేసిన స్టాండింగ్ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఎంపీ రఘునందన్ రావు ముందుగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ టీఎన్జీవో అధ్యక్షులు దేవి ప్రసాద్, కలెక్టర్ రాహుల్ రాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి టిఎన్జీవో క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగమని మభ్యపెట్టి పదవి విరమణ కాలాన్ని 57 నుండి 61 పెంచగా ప్రస్తుత ప్రభుత్వం 61నుండి 65 కు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

తద్వారా రాష్ట్రంలో చదువుకున్న యువత, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు 30 రోజులలో పూర్తి బెనిఫిట్ లు అందించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం వారికి సకాలంలో బెనిఫిట్లు లో ఇవ్వలేకపోతుందన్నారు. ఒక సంవత్సరంలో దాదాపు 8,000 మంది రిటైర్మెంట్ అయితే వారికి దాదాపు 20 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ వయసును పెంచి చేతులు దులుపుకోవాలని చూస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించే ఇన్కమ్ టాక్స్, యుపిఎస్ సవరణల కోసం కేంద్రంతో చర్చిస్తానని హామీనివ్వడంతో పాటు మెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్ల నుండి చార్మినార్ జోన్ కు మార్చేందుకు సహకరిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విధంగా కృషి చేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఎన్జిఓ అధ్యక్షులు దొంత నరేందర్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, మాజీ ఎన్జీవో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సుభాష్ చంద్ర గౌడ్, జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.