ముందుకొచ్చిన మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ తన్నీర్ రమేష్
వెల్దుర్తి,[Veldurti] జనవరి 20 సిరి న్యూస్
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో ఉదయం ప్రత్యేక తరగతుల కొరకై 140 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నారు ఈ సంవత్సరం ప్రత్యేక తరగతులు మొదలైనప్పటినుండి పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం అందజేయడం లేదు. ఈ విషయం విద్యార్థుల ద్వారా తెలుసుకున్న వెల్దుర్తి మండల కేంద్రం బిఆర్ఎస్ మండల పార్టీ నాయకుడు మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ తన్నీర్ రమేష్ ముందుకొచ్చి రోజు జరిగే పదవ తరగతి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం అందజేస్తానని ఈ విషయమై మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్వోడి సాంబయ్య కు తెలియజేశారు. రోజు ఉదయాన్నే 8:00 నుండి10వ తరగతి విద్యార్థుల విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారని వాళ్లకు అల్పాహారం అందజేయలేకపోతున్నామని ఈ విషయం తెలుసుకున్న మండల కేంద్రానికి చెందిన తన్నీర్ రమేష్ ఈరోజు నుండి ప్రతిరోజు పదో తరగతి విద్యార్థిని విద్యార్థుల కు అల్పారాన్ని అందజేశారు. గ్రామానికి చెందిన రమేష్ కు జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్వోడి మరియు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు