ఝరాసంగం :పడిపోయిన విద్యుత్ స్తంభం అనే శీర్షికతో ఆదివారం సిరి న్యూస్ లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు శనివారం మండలంలోని బొప్పన్ పల్లి చేరుకొని పడిపోయిన విద్యుత్ స్తంభాన్ని పట్టించుకోని అధికారులు సిరి న్యూస్ కథనానికి స్పందించి బొప్పన్ పల్లి గ్రామనికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పడిపోయిన విద్యుత్ స్తంభాన్ని పైకి లేపి ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్దీకరించారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన సిరి న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు.