చిలిపిచేడ్[Chiliped] జనవరి 26 (సిరి న్యూస్)
మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు నగేష్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ గావించి తదనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కొనియాడారు. అనంతరం శనివారం నాడు మండల కేంద్రంలో నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడిన తీరును దుయ్యబట్టారు. వచ్చిన విషయాన్ని వదిలిపెట్టేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల ఇండ్లు కోరినప్పుడు కేంద్ర మంత్రులు బాగున్నారు ఇప్పుడు వారిపైనే విమర్శలు చేసుడు మంచిది కాదు, ఆవుల రాజిరెడ్డి తన స్థాయిని మరిచిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మంచిది కాదని ఎలక్షన్ సమయంలో ఆరు గ్యారంటీలు ఇచ్చారు కదా ముందు వాటి పై దృష్టి పెట్టి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకి ఇల్లు ఇవ్వాలని అది కాకుండా కొందరిని మాత్రమే సెలక్షన్ చేయడం సరికాదు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని గ్రామసభలు పెట్టి రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారు ఇయ్యండి భేష్ శరత్ గా ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్లందరికీ ఇవ్వాలి ఆరు గ్యారెంటిలు అంటే మాటలు కాదు చేతులు అని చేసి నిరూపించండి అంతేగాని కొందరికిచ్చి ఎలక్షన్ కు పోవాలని చూస్తున్నారు అది సరికాదు రాబోవు ఎలక్షన్లో మీకు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టడం గ్యారంటీ భారతీయ జనతా పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం,మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను నెరవేర్చి అప్పుడు కదా మాట్లాడాల్సింది చిలిపిచేడ్ మండలంలో మండలానికి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం లేదని అద్దె భవనాల్లో కాలం వెల్లదీస్తున్న సంగతి తెలుసు కదా తెలిసి కూడా ఏమీ పట్టనట్టు ఆ విషయాలను వదిలేసి బిజెపి పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం సరికాదని అన్నారు చేతనైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్సే కదా ముందు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి నియోజకవర్గానికి మండలానికి కావలసిన ప్రభుత్వ భవనాలను నిర్మించే దిశగా వెళ్లాలని విమర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ జనరల్ సెక్రటరీలు వెంకటేశం సత్యనారాయణ, మహేందర్ బూత్ అధ్యక్షులు రాజా గౌడ్ శివకుమార్ చంద్ర రెడ్డి ప్రవీణ్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు