మండలాల పార్టీ అధ్యక్షులకు మెదక్ ఎంపీ రఘు నందన్ రావు దిశా నిర్దేశం
మనోహరాబాద్[Manoharabad]. జనవరి 16 సిరి న్యూస్
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయా మండలాల పార్టీ అధ్యక్షులకు మెదక్ ఎంపీ రఘు నందన్ రావు దిశా నిర్దేశం చేశారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, మనోహరాబాద్ మండల బిజెపి అధ్యక్షులు బక్క వెంకటేష్ గౌడ్,గజ్వేల్ మండల బిజెపి అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, కూకునూర్ పల్లి మండల బిజెపి అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి, కోండపాక మండల బిజెపి అధ్యక్షులు నీల సత్యం ముదిరాజ్, తూఫ్రాన్ పట్టణ బిజెపి అధ్యక్షులు జానకిరామ్ గౌడ్ లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులకు ఎంపీ సన్మానించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు సాగాలని నూతన అధ్యక్షులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను, టిఆర్ఎస్ నాయకుల అవినీతిని ప్రజలకు వివరిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు క్లుప్తంగా వివరిస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారని వారు తెలిపారు.ఫోటో. నూతనంగా నియమితులైన మండల పార్టీ అధ్యక్షులను సన్మానించిన మెదక్ ఎంపీ.