-పరీక్షను విజయవంతంగా నిర్వహించాం
-ఈనెల 6, 7 తేదీలలో ఫలితాలు వెల్లడిస్తాం
-టీబీఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొత్త మురళి
సంగారెడ్డి[sangareddy]:తెలంగాణ బయోలాజికల్ [Telangana Biological Science Forum] సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సైన్స్ సెంటర్‌లో బయోలాజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ – 2025 రాష్ట్రస్థాయి పోటీని శుక్రవారం నిర్వహించారు. గత నెల 18న జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన నలుగురు విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ఈ పరీక్ష ఫలితాలు జనవరి 6,7 తేదీలలో వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈసందర్భంగా టీబీఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొత్త మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి బైండ్ల రామక్రిష్ణ మాట్లాడుతూ
సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు, అనుమతితో జిల్లా సైన్స్ అధికారి పోగుల సిద్ధారెడ్డి సహకారంతో టీబీఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి లోని సైన్స్ సెంటర్ నందు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. గత సంవత్సరం సైన్స్ టాలెంట్ టెస్టులో సంగారెడ్డి జిల్లాకు రాష్ట్రస్థాయిలో మూడో స్థానం సాదియా నౌషిన్ జడ్పీహెచ్ఎస్ మిర్జాపూర్ విద్యార్థినికి వచ్చిందన్నారు. ఈ సంవత్సరం కూడా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.