మెదక్ జిల్లా బీసీ రాష్ట్ర నాయకులు బండారి గంగాధర్
శివంపేట్ జనవరి 20 (సిరి న్యూస్ ) : స్థానిక ఎన్నికల బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని జనగామ జిల్లా ఖిలాషాపూర్ నుండి ప్రారంభమైన బీసీ సైకిల్ యాత్రను హిందూ బిసి మహాసభ జాతీయ బత్తుల సిద్దేశ్వర్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించిన బీసీల ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ రాష్ట్ర నాయకులు బండారి గంగాధర్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నుండి బీసీ నాయకులు భారీ ఎత్తులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారుడు వట్టే జానయ్య , అర్జున్ , సూర్య రావు పార్వతి వెంకటేశం ,అరుణ్ , కొంగరి నరహరి , బీసీ రాష్ట్ర నాయకులు బండారి గంగాధర్, శంభోని రాజకుమార్ , బండారి సాయి కిరణ్ బిసి నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.