రామయంపేట [Ramayampeta]జనవరి 20 (సిరి న్యూస్)
రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల సమస్యల పై చేపట్టిన నిరసన లో స్థానిక బిజెపి నాయకులు సోమవారం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ ఏర్పడిన 2018 తర్వాత కేవలం ఒకే సారి మాత్రమే పారిశుధ్య పనులకు ఉపయోగించే వస్తువులు ఇచ్చారని తెలిపారు.కార్మికుల న్యాయమైన డిమాండ్ లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి పనుల కోసం వినియోగించే గ్లౌస్ లు, మాస్క్ లు, శానిటరీ, డ్రెస్ లు , బూట్లు అందించాల అన్నారు.పెండింగులో ఉన్న ఏడు నెలల పీఎఫ్ 4 వేల రూపాయలు వెంటనే అందించాలని,ప్రతి నెల సరైన సమయానికి జీతాలు చెల్లించాల పేర్కొన్నారు.2 రోజులు సెలవు రోజులు గా ఇవ్వాలని ప్రతి 3 నెలల కో సారి హెల్త్ చెకప్ క్యాంప్ కార్మికుల కోసం ఏర్పాటు చేయాల డిమాండ్ చేశారు.పారిశుధ్య కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం పై భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు జె. శంకర్ గౌడ్, దమ్మయ్య గారి భాను చందర్, ఆర్. వినయ్ కుమార్ నాయకులు ఉన్నారు.