
వెల్దుర్తి (సిరి న్యూస్ జనవరి 10 )
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు హస్తాల్ పుర్ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు చేరుకున్న కాంగ్రెస్ ఇంచార్జ్ రాజిరెడ్డికి ఆలయ పూజారులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకొని పంచ అమృతములతో స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని ఈ సంవత్సరం పాడి పంటలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ధర్మకర్తలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి నరేందర్ రెడ్డి మాజీ వైస్ మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు మల్లేశం చారి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు