జడ్చర్ల రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్న సిరి
మాసాయిపేట జనవరి 7 సిరి న్యూస్
మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని ఎస్వీకేఎం స్కూల్లో ఈనెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాసాయిపేట విద్యార్థిని దుంపల సిరి బంగారు, గైడ్ టీచర్ ఆంజనేయులు సహకారంతో స్వయం చాలక నీటి పారుదల రోబో విధానం తో ఇంటి వద్దనే ఉండి పంటలకు సాగునీరు అందించే నమూనాను ప్రదర్శిస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మపురి ఒక ప్రకటనలో తెలిపారు. వీరికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, సైన్స్ ఉపాధ్యాయులు రంగారెడ్డి రాష్ట్రస్థాయిలో మంచి ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయికి ఎన్నిక కావాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.