మద్దతుగా నిలిచిన సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
శివంపేట:మెదక్ జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మాపూర్ లో కస్టోడియన్ భూములను పేదలకు పంచాలని గత కొన్ని రోజుల నుంచి చదును చేస్తున్న పేదలను, వారికి మద్ధతు ప్రకటించిన సీపీఐ నాయకులను పోలీసులు గురువారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లక్ష్మాపూర్ గ్రామ పరిధిలోని కస్టోడియన్ భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పేదలు చదును చేస్తున్నారు. ఈ భూములను అక్రమార్కులు ఇష్టారీతిగా కబ్జాలు చేస్తూ అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంలో సిరి దినపత్రిక పతాక శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే పేదలు మాత్రం తమకు భూములను కేటాయించాలని కోరుతూ చదును చేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.