జిల్లా ఎస్సి ఎస్టి అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మనిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య.
జనవరి 23 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
అయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలలో పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఊరికి సంబంధించిన పేర్లను గ్రామాల్లో గ్రామసభల్లో వారి పేర్లు రావడం గ్రామాల్లో ఉన్న అసలైన పేదవారికి ప్రభుత్వం సహాయం అందక పోవడం చాలా బాధకరం అన్నారు ప్రజా పాలన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి కులగణన సర్వే ఎటుపాయే ఇప్పుడు ప్రజాపాలన గ్రామసభ అని డ్రామాలు చేయటం ఏమిటని ఆయన అన్నారు .ప్రజలను గోల్మాల్ చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు పథకాలు అందించడంలో విఫలమైందని అని ఆయన అన్నారు గ్రామ సభలో చదివిన జాబితాలోని ఇందిరమ్మ ఇండ్లు రైతు కూలీలకు ఇచ్చే రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు అందరికీ వస్తాయా లేక గ్రామసభలు సంతోషనికె పరిమితం అవుతుయా గ్రామ సభలలో తీసుకుని దరఖాస్తులు చెత్తబుట్టలకెనా వారికి ఇచ్చేది ఉందా?? తేట తెల్లం చేయాలని స్థానిక నాయకులు కాశపాగ ఇమ్మయ్య డిమాండ్ చేశారుస మాజీ మార్కెట్ కమిటీ చేర్మెన్ పల్లె సంజీవయ్య మాట్లాడుతు ఉమ్మడి పుల్కల్ మండలంలోని గ్రామాల్లో జరుగుతున్న గ్రామసభలకు హాజరైన ప్రజలను చూస్తే బాదేసిందని ఆయన అన్నారు ఎన్నో రోజులుగా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు కొత్త పింఛన్ కు రైతుబంధు భూమిలేని పేదలకు ఇస్తామని చెప్పినా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12000 బృతి కోసం దరఖాస్తులు తీసుకొని ఎదురు చూపులు చూస్తున్న ప్రజలకు నిరాశ మిగిలింది మళ్లీ దరఖాస్తులు పెట్టుకోవడానికి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అయన అన్నారు ఎర్రోళ్ల పోచయ్య మాట్లాడుతు భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 15000 ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు దాన్ని ఇప్పుడు 12000 ఇస్తానని చెప్పి కేవలం ఈజిఎస్ లేబర్ కార్డు ఉన్నవారికే పరిమితం చేయడంలో భూమిలేని జాబ్ కార్డు లేని చాలామంది ప్రజలు అయోమయం లో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట ప్రభుత్వం వచ్చాక మరో మాట అన్నట్టుగా ఉంది అన్నారు పేదలకు న్యాయం చేద్దామని ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఇంటింటికి ఇద్దరమ్మాయిలు వచ్చి ఫోటోలు తీసి పేరు గ్రామసభల్లో చదివిన తర్వాత జాబితాలో వారి పేరు లేని వారు ఎక్కువ సంఖ్యలో ఉండడం చాలా బాధాకరం పేదలకు న్యాయం చేద్దామని ఆలోచన ప్రభుత్వానికి లేదని ఇంటింటికి ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఫోటోలు తీసి గ్రామసభల్లో చదివిన జాబితాలో వారి పేరు లేదని తెలిసి ప్రభుత్వ అధికారులపై ఆసాహనం వ్యక్తం చేస్తున్నారని ఇప్పటికైనా అర్వులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు కొత్త పైన్షన్ లు భూమి లేని వారికీ భూములు ఇచ్చి నిరుపేదలకు అండగా ఉండాలని ప్రభుత్వం ఆసరా అందించాలని ఆయన అన్నారు ఇ కార్యక్రమం లో కౌన్సిలర్ సంతోష్. డాకూరు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.