సిరి న్యూస్ అందోల్[andole] :
ఈరోజు ఆందోల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాలను పరిశీలించాడు. నవోదయ స్కూల్, మరియు ఇందిరమ్మ ఇండ్లు స్థలం లేని వారికి ఇండ్ల స్థలం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించాడు. రాబోయే రోజులలో అందోల్ ను ఇక్కడ లేని విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అందోల్ చెరువును ట్యాంక్ బండ్ గా తయారు చేస్తానని తెలియజేశారు, రాబోయే రోజులలో అందోల్ చెరువు కట్టను టూరిజం హబ్బుగా తయారు చేస్తానని మంత్రి అన్నారు. ఆర్డీవో పాండు, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, డిప్యూటీ తాసిల్దార్, ఏఈలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మైనార్టీ నాయకులు అందోల్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.