తమ భక్తిని చాటుకున్న ఎక్సైజ్ జయసుధ, సురేష్ బాబు దంపతులు..
రామయంపేట[Ramayampet] జనవరి 25 (సిరి న్యూస్)
రామాయంపేటలో జరుగుతున్న శ్రీ చిత్తరమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు భక్తులు, పట్టణవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రామాయంపేట ఎక్సైజ్ సిఐ జయసుధ, ఆమె భర్త పడమటి సురేష్ బాబు బంగారు నక్లెస్ అందజేయడం జరిగింది. దీని విలువ సుమారు 35 వేల పైన ఉంటుందని తెలిపారు. అమ్మవారికి నగ సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కి నక్లెస్ అందించిన దంపతులను సన్మానించడం జరిగింది.అలాగే చిత్తారమ్మ సగర సంఘ సభ్యులు వారిని అభినందించడం జరిగింది.