సిరి న్యూస్ /గుమ్మడిదల[gummadidalila]
గుమ్మడిదల గ్రామ రైతు సంఘం అధ్యక్షులుగా అమ్మగారి సదానంద రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మండల కేంద్రమైన గుమ్మడిదలలోని రైతు సంఘం భవనంలో గ్రామ రైతు సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి రైతు సంఘం ఎన్నికలను నిర్వహిస్తారు ప్రస్తుతం ఉన్న పోచుగారి మోహన్ రెడ్డి పదవి కాలం ముగియడంతో ఎన్నిక నిర్వహించారు. గ్రామంలో రైతు సమస్యలను పరిష్కరించాలని రైతుల కోరారు. రైతులకు విన్నంటూ ఉండి అధికారుల సూచనలు గ్రామస్తుల సలహాలు తీసుకొని రైతులకు అందుబాటులో ఉంటానని సదానంద రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను రైతులకు అందే విధంగా తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.