నిమ్న జాతుల విద్యార్థులకు చదువు నేర్పిన మొదటి ఉపాధ్యాయురాలుః
తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్
ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు నిర్వహించిన మల్లన్న టీం
మునిపల్లి :సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను శుక్రవారం నాడు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో మండలంలోని కంకోల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశం సామాజిక వ్యవస్థలో అణగారిన వర్గాలకు విద్య నిషేధించబడిన కాలంలో.. విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తన భర్త మహాత్మా జ్యోతిరావుపూలే అడుగుజాడల్లో నడిచి.. నిమ్న జాతుల విద్యార్థులకు చదువు నేర్పిన మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయిపూలే అని కొనియాడారు. అలాగే కుల మతాలకతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిని అమ్మ సావిత్రిబాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు తదితరు పాల్గొన్నారు.