పోచమ్మ కుంట[Pochamma kunta]సమీపంలో రోడ్డు మూలమలుపు వద్ద ఏపుగా పెరిగిన చెట్లతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తెల్లవారుజామున మంచు కురిసే సమయంలో, లేదా రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పక్కనే వైన్ షాప్ ఉండడంతో జనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేయడం కూడా సమస్యగా మారుతుంది. అధికారులు రోడ్డు పక్కన చెట్లను తొలగించి సమస్యను పరిష్కరించాలి.