అంబులెన్స్ ఇవ్వడం పట్ల బీజేపీ నాయకులు అరుణ్ రాజ్ శేరికర్ హర్షం
నారాయణఖేడ్, జనవరి 7 సిరి న్యూస్
సిర్గాపూర్ మండలానికి నూతనంగా 108 అంబులెన్స్ కేటాయించడంపై బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్ రాజ్ శేరికర్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలం ఏర్పాటు నుండి ఇప్పటివరకు 108 అంబులెన్స్ లేకపోవడంతో మండలం ప్రజలకు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఈ మేరకు అంబులెన్స్ కోసం తాము పోరాటం చేసామని గుర్తు చేశారు.ప్రభుత్వం స్పందించి అంబులెన్స్ ఇవ్వడం పట్ల మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.