గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి:

All arrangements should be made for the Republic Day celebrations
All arrangements should be made for the Republic Day celebrations

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష.

జనవరి 9 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి:[sangareddy]
జనవరి 26 గణతంత్ర దినోత్సవం[January 26 is Republic Day]సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్రాంతి వల్లూరు అధ్యక్షతన జనవరి 26, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి ల తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారుల నిర్దేశించి మాట్లాడారు . గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన వేదికను తగిన శ్రద్ధతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవానికి అనువుగా జరిగే పరేడ్ ప్రదర్శనకు అన్ని శాఖల నుంచి సమన్వయం చేసుకొని వేడుకలలో ఇలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో సురక్షితమైన వాతావరణం లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు శాఖకు సూచించారు. పోలీసు శాఖ, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్,జాతీయ భావాలు, దేశభక్తి గేయలతో విద్యార్థుల సాంసృతిక ప్రదర్శనలు ఆకర్షణీయంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను నిషేధించాలన్నారు.

ఈ కార్యక్రమం జరిగే ప్రదేశాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద శుభ్రత పనులను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా వేదిక వద్దకు వచ్చే మార్గాలను పరిశుభ్రంగా ఉంచడం,తాగునీటి సౌకర్యం కల్పించడం వంటి పనులపై దృష్టి పెట్టాలన్నారు. దేశభక్తి గేయలతోవిద్యార్థులు, యువతతో సాంస్కృతిక ప్రదర్శనల ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను తెలిపే శకటాల ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. వివిధ విద్యాసంస్థల నుంచి మంచి ప్రదర్శనల్ని ఎంపిక చేయడం, అవార్డుల ద్వారా విద్యార్థులను ప్రోత్సహించడం పట్ల స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాజకీయ ప్రముఖులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, సంఘ సేవకులను ఆహ్వానించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి శాఖ తన పనిని సమయానికి పూర్తి చేసి, నిర్దేశిత సమయానికి అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డి ఆర్ ఓ పద్మజ రాణి , పోలీస్ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.