శివంపేట్ : శివంపేట్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శివంపేట్ మండల్ పోతులబొగుడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య ముఖ్య నాయకులు శర్మయ్య, విశ్వనాథం, కుమ్మరి నర్సింలు, బిక్షపతి, పందుల సత్యనారాయణ, పందుల వెంకటేశం, సత్యనారాయణ గౌడ్, కొలిచేల్వ యాదగిరి, సుమారు 30 మంది ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన నర్సాపూర్ ముద్దుబిడ్డ టిపిపిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, పోతులబోగుడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద ప్రవీణ్ మరియు CVR యూత్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.