జిన్నారం [jinnaram] జనవరి 08 (సిరి న్యూస్)
జిన్నారం[jinnaram] నుండి ఊట్ల వెళ్లే రహదారిలో రోడ్డు మూల మలుపు పక్కన చెట్లు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు ఎదు రుగా వచ్చే వాహనాలను గుర్తించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. మలుపుల వద్ద మరింత ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్న అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని రోడ్డు పక్కన పెరిగిన చెట్లను తొలగించి ప్రయాణికులకు రక్షణ కల్పించాలని కోరారు