మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
రూ.లక్ష ఆస్తి నష్టం..
బాధితుడు కనకయ్యకు సిజిఆర్ ట్రస్ట్ ఛైర్మన్ ఆర్థిక సాయం
గుమ్మడిదల, జనవరి 5 సిరి న్యూస్ః
మండల కేంద్రమైన గుమ్మడిదలలో ప్రమాదవశాత్తూ గడ్డివాము దగ్ధమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గుమ్మడిదల గ్రామానికి చెందిన జిన్న కనకయ్య గడ్డివాము ప్రమాదపు శాత్తూ దగ్ధమైంది. తన వ్యవసాయ పంట పొలంతో పాటు ఇతరుల వద్ద దాదాపు 1500 గడ్డి మోపులనుకొనుగోలు చేసినట్లు బాధితుడు తెలిపాడు తనకు పశువులు ఉన్నాయని వాటికోసం గడ్డిని వాముగా పేర్చామని గడ్డి దగ్ధం కావడంతో దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం జరిగిందని కనకయ్య తెలిపారు.
ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఆర్థిక సాయం అందజేత స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి సంఘటన స్థలం చేరుకొని నష్టపోయిన రైతు జిల్లా కనకేశకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత రైతు కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ :1 మంటలు నడుపుతున్న అగ్గిమాపక సిబ్బంది