రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ.

Acceptance of Rythu Bharosa applications.
Acceptance of Rythu Bharosa applications.

రామాయంపేట[Ramayampet] జనవరి 24 (సిరి న్యూస్)
తెలంగాణ రాrష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఎకరాకు 6000 చొప్పున రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమం ఈనెల 26వ తారీఖున ప్రారంభం జరుగుతుంది ఇందులో భాగంగా 1 -1 -2025 తేదీలోపు కొత్తగా పట్టదారు పాస్ పుస్తకం పొందిన రైతులందరూ వెంటనే రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని రామయంపేట మండల వ్యాప్తంగా 767 మంది రైతులకు కొత్తగా పట్ట పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగిందని వీరందరూ వెంటనే తమ వ్యవసాయ పట్ట పాసు పుస్తకం జిరాక్స్ మరియు బ్యాంకు ఖాతా మరియు ఆధార్ కార్డు జిరాక్స్ ను వ్యవసాయ కార్యాలయంలో గాని సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు గాని వెంటనే అందజేయాలని ఇంచార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ తెలిపారు బ్యాంకు ఖాతాలకు సంబంధించి క్రాప్ లోన్ అకౌంట్ ఉన్న లేదా యాక్టివేట్ లేని అకౌంటు ఉన్న అకౌంట్ మార్పు కోసం కొత్తగా బ్యాంకు ఖాతా వాటి వివరాలను వ్యవసాయ కార్యాలయం లో అందజేయాలని తెలిపారు.
ఇంతకుముందే పట్టా పాస్ పుస్తకాలు పొంది రైతు భరోసా పొందుతున్నటువంటి రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీనివాస్, సాయి కృష్ణ, ప్రవీణ్ ,సందీప్ తో పాటుగా రైతులు పాల్గొన్నారు