కౌడిపల్లి[Kaudipalli]జనవరి 16 (సిరి న్యూస్)
అక్క పెళ్లి కోసం చేసిన అప్పును ఎలా తీర్చాలని మనోవేదనకు గురై యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లి లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పల్లె బిక్షపతి కుమారుడు పల్లె కృష్ణ 23 సం,, వ్యవసాయం, సెంట్రింగ్ పని కి వెళ్ళేవాడు గత సంవత్సరం అక్క పెళ్లి కోసం తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర అప్పులు తెచ్చాడు. అప్పులు తిరిగి చెల్లించాలన్న ఉద్దేశంతో వ్యవసాయం చేయాలని మరికొంచెం అప్పులు వెచ్చించి పొలంలో బోరు వేయగా అది ఫెయిల్ కావడంతో కృష్ణ గత కొన్ని రోజులుగా మనోవేదనకు గురయ్యాడు . దీంతో గురువారం ఉదయం పొలం దగ్గరికి వెళ్లిన కృష్ణ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి బిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే కృష్ణ చిన్న వయసులో అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.