
మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దళిత రత్న డాక్టర్ బి జనార్ధన్.
జనవరి 25 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి[sangareddy]
భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం జాతీయ జెండా వద్ద ఏర్పాట్లు నిర్లక్ష్యం వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ప్రభుత్వపరమైన ఆదేశాలు జారీ చేయాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి జనార్ధన్ కోరారు
భారతదేశనికి రాజ్యాంగ రూపకల్పన చేసి భారతదేశ ప్రజలకు దశ దిశ నిర్దేశించి అన్ని విధాల భారత రాజ్యాంగంలో సంపూర్ణంగా హక్కులను కల్పించి సంపూర్ణంగా స్వాతంత్రం అందించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గణతంత్ర దినోత్సవము దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయంలో జాతీయ జెండా వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలని కొన్ని కార్యాలయాల్లో గాంధీ బొమ్మ పెడుతున్నారు గాంధీ చనిపోయింది 30:01948 నాడు భారతదేశం గణతంత్ర రాజ్యాంగ అవతరించింది 26:01:1950 మరి రిపబ్లిక్ డే కి గాంధీకి ఏమిటి….? సంబంధం. ఉంది అంటే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే అని మాల మహానాడు తరపున కోరుతున్నాం.