పెద్ద శంకరంపేట,[pedda shank (సిరి న్యూస్):
మార్కండేయ జయంతి సందర్భంగా పెద్ద శంకరంపేట లోని మార్కండేయ మందిరంలో మహిళలు సహస్ర సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. పూజారి రాయల వారి మహేష్ శర్మ, వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జరి కనకరాజు ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం బాధ్యులు గుజ్జరి అనిల్ కుమార్, మెదక్ జిల్లా చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు మహంకాళి కృష్ణమూర్తి, వడిచెర్ల మల్లేశం, చందుపట్ల లింగం, పడాల సుధీర్, గుజ్జరి నారాయణ, జంగం రాములు, అధిక సంఖ్యలో పద్మశాలి సంఘం బాధ్యులు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.