గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా కత్తితో పొడిచి వ్యక్తిని హత్య

A man was brutally stabbed to death by unknown persons
A man was brutally stabbed to death by unknown persons

శివంపేట్[sivampet] ఫిబ్రవరి 2 (సిరి న్యూస్ )
ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంటిక్యాదేవమ్మగూడ గ్రామపంచాయతీ పరి ధిలోని సామ్య తండాలో ఆదివారం వెలుగుచూసిం ది. వివరాల్లోకి వెళ్తే… తండాకు చెందిన మదన్లాల్ (40) తల్లిదండ్రులు కొన్నేండ్ల చనిపోగా, అతడి భార్య సైతం భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కొందరు గుర్తుతెలియనివ్య క్తులు మదన్ లాల్ ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆదివారం సాయంత్రం మదన్లాల్ ఇంటి డోర్లు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో కనిపించా డు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మధుకర్రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం తూప్రాన్ సీఐ రంగా కృష్ణతో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది
చేరుకొని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.