అగ్నికి ఆహుతైన సాయి సంతోషి రేణుక ఇండస్ట్రీస్
రూ.3కోట్ల వరకు జరిగిందన్న కంపెనీ యజమాని
వెల్దుర్తి, జనవరి 13 ( సిరి న్యూస్ )
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామ సమీపంలో గల సాయి సంతోషి రేణుక ఇండస్ట్రీస్( ప్లాస్టిక్ కంపెనీ)లో ఆదివారం రాత్రి 11 గంటలకు భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల వాళ్ళు గమనించి కంపెనీ యజమానులకు సమాచారం ఇవ్వగా దీంతో ఘటన స్థలానికి చేరుకున్న కంపెనీ యజమానులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలి కి చేరుకొని మంటలు అదుపు చేశారు. అంతలోపే పరిశ్రమ పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయిందని యజమానులు తెలియజేశారు దాంట్లో కంపెనీ సంబంధించిన మిషనరీ, ముడి సరుకు, రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైనవని కంపెనీ యజమాని తెలపడం జరిగింది సుమారుగా మూడు కోట్ల పైగా ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్కట్ వల్ల జరిగే ఉండొచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు ఇంత పెద్ద ప్రమాదం జరిగి సుమారు మూడు కోట్ల ఆస్తి నష్టం జరిగిన అట్టి కంపెనీ యజమానులను ప్రభుత్వప రంగా ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.