-స్త్రీల విద్యకోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే
-కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఉద్యమకారిణి
-యువజన కాంగ్రెస్ నాయకులు సాదుల పవన్ కుమార్, ఇమ్రాన్
-నంగునూరులో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయిపూలే జయంతి వేడుకలు
సిద్దిపేట[Siddipet] [Nangunur] (నంగునూరు):మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నంగునూరు మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి ఎండి ఇమ్రాన్, సాదుల పవన్ కుమార్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయురాలు, రచయిత్రి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి మహిళల విద్య అభివృద్ధి కోసం విశేష కృషి చేశారన్నారు.
అనంతరం సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే కు ఘననివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శమని అన్నారు. మహిళల హక్కులు, సామాజిక సమస్యలపై కూడా అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. సావిత్రిబాయి పూల జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడే అశోక్, నాగేష్, రాజు, బడే నవీన్, యాదగిరి, బద్దుల అజయ్, బొజ్జ గోపి, కృష్ణ, దాసరి నర్సింలు, రాజయ్య, శంకరయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.