మ‌ర‌ణించినా మ‌రిచిపోని స్నేహం

A friendship that never dies
A friendship that never dies

క్రికెట్లో గెలుపొందిన డబ్బులతో మృతిచెందిన స్నేహితుల పేరిట విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ
రామయంపేట [Ramyampeta]జనవరి 20 (సిరి న్యూస్)
స్నేహమంటే కేవలం బిందు వినోదాలకే కాకుండా తాము చేసిన స్నేహం ఎల్లప్పుడూ గుర్తుండాలని యువకులు గుర్తు చేసుకున్నారు. మరణించిన వారి స్నేహితులను మర్చిపోకుండా ఉండడానికి వారి పేరిట విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసి తమ స్నేహాన్ని చాటుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే ….రామయంపేట మండలం దామరచెరువు గ్రామానికి చెందిన యువకులు ఇటీవలే గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన క్రికెట్ పోటీల్లో తమ స్నేహితులు మరణించిన దండు బాబు, కుస్తీ స్వామి పేరిట బిఎస్ టీమ్‌గా ఏర్పడి క్రికెట్లో పాల్గొనడం జరిగింది. ఈ పోటీల్లో రన్నర్ గా నిలవడంతో నిర్వాహకులు ఆ టీంకు 5000 రూపాయలు బహుమతి అందజేయడం జరిగింది. అయితే ఆ డబ్బులను వృధా చేయకుండా టీం సభ్యులు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు, అంగన్వాడి, తండాలోని అంగన్వాడి పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు తమ స్నేహితుల పేరుట ఙ్ఞాపకం అందజేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో విద్యుత్కు సంబంధించిన అవసరాలను తాము బరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. యువకులు చేసిన పనికి గ్రామస్తులతో పాటు, వారి తల్లిదండ్రులు ఎంతో అభినందించడం జరిగింది.