జనవరి 30 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
అహింస, సత్యాగ్రహలే ఆయుధాలుగా అఖండ భారతా వనికి,స్వేచ్చా,స్వాతంత్రాలు,ప్రసాదించిన మహా నాయకుడు,సమస్త విశ్వానికి,శాంతి సందేశం ప్రభోదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ 77 వ వర్ధంతి సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహనికి పూల మాలవేసి నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, ఉపాధ్యక్షులు, సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి గడ్డం పాండు రంగం తదితరులు పాల్గొన్నారు.