నారాయణఖేడ్ జనవరి 26 (సిరి న్యూస్) సంబరాలలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి.
నారాయణఖేడ్[[Narayankhed]: పట్టణం లోని తహసిల్దార్ గ్రౌండ్ లో ఆదివారం ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ సంబరాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్.నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ పట్టణంలో ఎమ్మార్వో, మున్సిపల్, ఆర్డిఓ, డి.ఎస్.పి, సీఐ, ఎస్ఐలు, పలు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు వారి వివిధ నాటకాలను నృత్యాలను ప్రదర్శించారు. అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులలో ఉత్తమ అధికారులను గుర్తించి వారికి బహుమతులను ప్రధానం చేసిన ఎమ్మెల్యే, ఎంపీ.ఈ కార్యక్రమంలో వారితో పాటు వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన ఉన్నతాధికారులు మరియు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు ఉపాధ్యాయులు యాజమాన్య బృందం మరియు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శేట్కర్, వైస్ చైర్మన్ దారంశంకర్ సెట్, కౌన్సిలర్లు. ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.