శివంపేట్[shivampet] జనవరి 26( సిరి న్యూస్ )
శివంపేట మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ, రాజకీయ కార్యాలయ వద్ద ఆయా శాఖల అధికారులు, రాజకీయ నాయకులు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ జెండాను ఎగురవేశారు. అందులో భాగంగా శివంపేట పిఎసిఎస్ కార్యాలయం ఏసిఎస్ చింతల వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, మండల వనరుల కేంద్రం మండల విద్యాధికారి బుచ్చా నాయక్, శాఖ గ్రంధాలయం అర్చన, ప్రభుత్వ ఉన్నత పాఠశాల కార్యాలయం ప్రధానోపాధ్యాయులు బాలచంద్రం, గ్రామపంచాయతీ కార్యాలయం గ్రామ కార్యదర్శి రమాదేవి, ఎంపీడీవో కార్యాలయం ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా, ఎమ్మార్వో కార్యాలయం ఎమ్మార్వో కమలాద్రి చారి, పశు వైద్యశాల కార్యాలయం దగ్గర డాక్టర్ సంధ్యారాణి, ఘనంగా గణతంత్ర దినోత్సవ త్రివర్ణ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.