వ్యవసాయ శాఖ అధికారిని స్రవంతి…
మనోహరాబాద్,[manoharabad] జనవరి 21. సిరి న్యూస్.
మనోహరాబాద్ మండలంలో 1360 ఎకరాలు సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించామని మండల వ్యవసాయ శాఖ అధికారిని స్రవంతి తెలిపారు. ప్రస్తుతం మండలంలో 9643 ఎకరాల లో వ్యవసాయ సాగు చేపట్టారని ఆమె అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాల మంజూరు కోసం ప్రభుత్వం ఆదేశించిన విధంగా మండలంలో గత వారం రోజులుగా సమగ్ర సర్వే చేపట్టామని ఆమె అన్నారు. మండల వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో ఇండ్ల స్థలాలు, రాళ్లు, రప్పలు, రోడ్లు, వెంచర్లలో ఉన్న 1360 ఎకరాలను గుర్తించి పంటల సాగుకు యోగ్యం లేదని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చామన్నారు.