ఫిబ్రవరి 6 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
ఈ నెల 10 వ తేదీన జిల్లాలో నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖలన్ని సమిష్టి గా విజయవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు.
గురువారం ఐసీసీ లోని మినీ సమావేశ మందిరంలో ఈ నెల 10 తేదీ న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం -2025 , పై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ వంద శాతం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు . ఈ సందర్భముగా కల్లెక్టర్ మాట్లాడారు .జిల్లాలో 4,05,207 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలనే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ రూపొందించాలని అన్నారు . ఫిబ్రవరి 10న కార్యక్రమ ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమం లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు , సంక్షేమ హాస్టళ్లలో డివార్మింగ్ ట్యాబ్లెట్ ( ఆల్బెండజాల్) పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆల్బెండజోల్ మాత్రలు1-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ వేయాలని సూచించారు . నేషనల్ డి-వార్మింగ్ డే ను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు అన్నింటిలో నూ ఒక నూడల్ అధికారిని ( నోడల్ ఆఫీసర్స్) నియమించాలని సూచించారు. తెల్లాపూర్ , అమీనాపూర్ , జి హెచ్ ఏం సి లాంటి అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా టాబ్లెట్ అందని పిల్లలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వలసదారుల పిల్లలు, అనాథ పిల్లలు ఉన్న ప్రాంతాలు, శిబిరాలు, తక్కువ పారిశుద్ధ్య పరిస్థితుల్లో జీవించే సమూహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ఫిబ్రవరి 10న ప్రారంభమైన డీ-వార్మింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత, చివరి విడత ఫాలో-అప్‌గా ఫిబ్రవరి 17న (Mop-up Day) ద్వారా మిగిలిన వారికి మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు . మండల స్థాయి,మునిసిపల్ స్థాయిలలో అధికారులు కోఆర్డినేషన్ సమావేశాలు ఏర్పాటు చేసుకోని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు .ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుణి డా .గాయత్రీ ,జడ్పీసీఈఓ జానకిరెడ్డి ,డి పి ఓ సాయిబాబా,బి సి సంక్షేమాధికారి జగదీశ్ ,డీఈఓ వెంకటేశ్వర్లు , సంబంధిత శాఖల అధికారులు, వివిధ ఎన్ జి ఓ ల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.