హత్నూర : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనమందించాలని జెడ్పీ డిప్యూటీ సిఈఓ స్వప్న అన్నారు.మండలంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయం వసతి గృహాన్ని గురువారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు.వంట శాలను సందర్శించి విద్యార్థుల కోసం సిద్ధం చేసిన వంటలను పరిశీలించారు.విద్య,ఆరోగ్యం,భోజనం విషయంలో విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని అధ్యాపక సిబ్బందికి సూచించారు.వారి వెంట ఎంపీడీవో శంకర్ తదితరులు ఉన్నారు.