సర్వేను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలి రేషన్ కార్డుల సర్వే పరిశీలించిన జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య
రామయంపేట, జనవరి17 (సిరి న్యూస్)
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలలో భాగంగా శుక్రవారం రేషన్ కార్డుల సర్వే కార్యక్రమం కొనసాగింది. అందులో భాగంగా కోనాపూర్ గ్రామంలో జరుగుతున్న రేషన్ కార్డుల రీ వెరిఫికేషన్ ఇంటింటికి తిరిగి అధికారులు చేస్తున్న సర్వేను జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య ఆకస్మికంగా గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న నిరుపేద ప్రజలకు రేషన్ కార్డు లేని అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు.ఈ సర్వేను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు