నారాయణఖేడ్: మండల పరిధిలోని జూకల్ గ్రామంలో ఆదివారం ప్రజా పాలనలో 4 సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని అన్నారు.
ఈ పార్టీ ఎప్పుడు నిరుపేదల గురించి ఆలోచించే పార్టీ అందుకోసమే భూమిలేని నిరుపేద రైతుల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఉపాధి హామీ పథకంలో పనిచేసిన రైతు కూలీలకు సంవత్సరానికి ₹12,000 ఇచ్చి నిరుపేదలకు అందిస్తున్నాం అన్నారు. మరియు రైతు భరోసా పథకం కింద ఒక్క ఎకరాకు 12000 రూపాయలను అందిస్తున్నమన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కానీ మా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలంలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను అందిస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మరియు కర్నె శ్రీనివాస్,శంకరయ్య స్వామి,పిసిసి సభ్యులు,శివ రాథోడ్ యూత్ కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యక్షులు,మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్,రమేష్ చౌహాన్, తహేర్ అలి, వినోద్ పాటిల్,పండరి రెడ్డి,సంగాన్న న్యాయవాది,అశోక్ రెడ్డి pacs వైస్ చైర్మన్,నెహ్రూ నాయక్,శ్రీకాంత్ రెడ్డి,వినయ్ తాజా మాజీ సర్పంచ్,మరియు జుక్కల్ గ్రామ ప్రజలు,నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.