ఉక్కు గుండెని హత్తుకోడానికి పాద యాత్ర..

Zaheerabad MLA Manik Rao Padayatra
Zaheerabad MLA Manik Rao Padayatra

– ఝరాసంగం కేతకి సంగమేశ్వరుని ఆశీస్సులతో ఎర్రవల్లి వరకు..
– పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావ్..

ఝరాసంగం  : ఝరాసంగం మండలంలోని మేదపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ నేతృత్వంలో 50 మంది యువకులు,అభిమానులతో ఝరాసంగం నుండి మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావును కలిసేందుకు చేపట్టిన పాదయాత్రను సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రారంభించారు. ముందుగా అందరూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు, పరమేశ్వర్ పాటిల్ తో పాటు పాదయాత్రకు తరలి వెళ్తున్న వారిని వారిని ఎమ్మెల్యే మాణిక్ రావు ,ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎం ఎస్ శివకుమార్,ఝరాసంగం మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, ఘనంగా సన్మానించి అభినందించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పై అభిమానంతో ఆయన్ని కలిసేందుకు ఝరాసంగం దేవస్థానం నుండి ఎర్రవల్లి వరకు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని .సంగమేశ్వర స్వామి ఆశీర్వాదంతో పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆయన ఆశించారు. ప్రజా,రైతు సంక్షేమం కోసం,రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ చేపట్టిన పథకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరని ఆయన కొనియాడారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్తున్నా సంక్షేమ పథకాలు అన్ని నామ మాత్రంగా అమలుచేసి తరువాత వదిలేస్తారని ,అర్హులందరికీ ఇస్తామని చెప్పి మండలంలో ఒక్క గ్రామం మాత్రమే ఎంపిక చేయటం సిగ్గు చేటు అని అన్నారు.

రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ల పథకాలు పేపర్లకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుందని దీనిపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు.బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వెన్నంటి ఉండి వారి సమస్యలపై పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మేదపల్లి మాజీ సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు జగదీశ్వర్, కేతకి ఆలయ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్సం, గమేశ్వర్, బస్వరాజ్, ప్రశాంత్, కుమ్మరి మారుతీ,కుమ్మరి ప్రశాంత్,చెంద్రయ్య ,గొల్ల మాణిక్,గొల్ల వెంకట్,సతీష్, పాండు,బోయిని పాండు,ఎలాభంటూ విజయ్,బోయిని శ్రీనివాస్,మోహన్,అవసలి బస్వారాజ్,చాకలి రాము, కుమ్మరి అశోక్,పట్లోళ్ల శివు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎంపీ నాగన్న పటేల్, ఎజాజ్ బాబా , మాణిక్ యాదవ్, ఎస్ కే సోయల్, కేసీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.