వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలి
ఎంపీడీఓ ఉమాదేవి
యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ
గుమ్మడిదల జనవరి 6 సిరి న్యూస్ : గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి పారిశ్రామిక వాడ లో మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా బొంతపల్లి కమాన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు ఈ సందర్భంగా మండల ఎంపిడిఓ ఉమాదేవి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ యువత మద్యం, గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని సూచించారు. స్వామి వివేకానంద స్ఫూర్తి తో ముందుకు సాగాలని అన్నారు.
జానపద కళాకారుల గీతాలతో ఆలపించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు జనచైతన్య కళాసంస్థ నాయకులు వి. ఎం.ఎల్లయ్య, మంద భాస్కర్ రెడ్డి, చెన్నం శెట్టి ఉదయ్ కుమార్, సరెడ్డిగారి బిక్షపతి రెడ్డి, కళాకారులు రవి, శ్రీకాంత్, కృష్ణ పాండు,యువజన నాయకులు, యం .ప్రసాద్, విష్ణు వర్ధన్,సుదర్శన్, యం. రమేష్, రవి, బొంతపల్లి నూతన హమాలీ సంఘము నాయకులు,కృష్ణ, శ్రీకాంత్, దాసు, ఏడుకొండలు, శేకర్, ఈశ్వర్ యువకులు పాల్గొన్నారు.