పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
నూతన విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే
గుమ్మడిదల, జనవరి 12 సిరి న్యూస్ : వివేకానందుని అడుగుజాడలో యువత నడవాలని పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (mahipal reddy) అన్నారు ఆదివారం మండల కేంద్రమైన గుమ్మడిదలలో వివేకానంద నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ యువత పూర్తిస్థాయిలో వివేకానందుని అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. యువతను ఉత్తేజపరిచిన వారిలో వివేకానందుడు ఉత్తమముడు అన్నారు.
ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్, సి జి ఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లలిత, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి , మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ ,రైతు సంఘం అధ్యక్షులు మోహన్ రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, దేవాదాయ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి , పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్ , ఉప సర్పంచ్ మొగులయ్య, కాల కంటి రవీందర్ రెడ్డి, వాలీబాల్ కోచ్ జానీ, అమ్మవారి ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, సద్ది భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.