యువత స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి -మాజీ జడ్పిటిసి బాల్ రెడ్డి

జిన్నారం జనవరి 09 సిరి న్యూస్ : యువత స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాల‌ని మాజీ జడ్పిటిసి బాల్రెడ్డి అన్నారు. గురువారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన వినయ్ ఏర్పాటుచేసిన కార్ సర్వీస్ సెంటర్ ను మాజీ జడ్పిటిసి బాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఉపాధి అవకాశాల వైపు ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వినయ్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను నాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వీరప్ప యాదవ్ శ్రీకాంత్ యాదవ్ స్థానికులు గోవింద గోస్ సురేష్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.