కరెంట్ షాక్ తో అన్నను చంపిన తమ్ముడు
శివ్వంపేట్ జనవరి 18 (సిరి న్యూస్ )
శివంపేట్ మండలం భిక్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని నాను తండాకు చెందిన తేజావచందర్ గారికి ఇద్దరు కుమారులు గోపాల్ శంకర్ వీరు రాత్రి భోజనం చేశాక ఒకే రూంలో పడుకున్నారు.
కానీ తెల్లవారుజామున తమ్ముడైన గోపాల్ అన్న శంకర్ కాళ్ళకి అర్త్ ఫేస్ రెండు వైర్లు వేసి విద్యుత్ షాక్ పెట్టాడు. శంకర్ కేకలు వేయడంతో గోపాల్ పారిపోయాడు.తండ్రి వచ్చేసరికి శంకర్ (28) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.