రామాయంపేట, జనవరి 12 సిరి న్యూస్ః మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆన్ లైన్ బెట్టింగ్ (online betting) కు అలవాటు అప్పుల పాలై శనివారం రాత్రి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.మృతు డి బంధువుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చాకలి ప్రశాంత్ (24) హైదరాబాద్ లోని తూంకుంట ప్రాంతం లోని ఓ పెట్రోలు బంకు లో పని చేస్తున్నాడు.కాగా అతను ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై సుమారు రూ.9 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు.ఇవి తీరే మార్గం లేక చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు.