ఉరి వేసుకుని యువకుడు ఆత్మ‌హ‌త్య‌

ఎంబరి లక్ష్మణ్ (23)
ఎంబరి లక్ష్మణ్ (23)

ఉరి వేసుకుని యువకుడు ఆత్మ‌హ‌త్య‌

కొల్చారం, జ‌న‌వ‌రి 17 సిరి న్యూస్ః
ఇంట్లో గొడవపడి ఉరివేసుకొని యువకుడుమృతి చెందిన సంఘటన కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది, గ్రామస్తులు, పోలీసులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎంబరి లక్ష్మణ్ (23) హైదరాబాదులో కారు డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొన్ని నెలల క్రితం తన చెల్లి పెళ్లి కోసం అప్పులు కావడంతో మృతుడి అమ్మ మల్లమ్మ రెండు గంటల వ్యవసాయ భూమి అమ్మి అప్పులు తీర్చాలనుకుంది. కానీ, కొడుకు నాకు కారు కావాలని గొడవ పడ్డాడు. అందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో రాత్రి అందరూ పడుకున్న తరువాత ఇంట్లో దూలానికి ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి తల్లి చూసేసరికి కొడుకు మృతి చెందియున్నాడు. తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో త‌నే ప‌నులకెళుతూ కూతురును,కొడుకును పోషిస్తుంది. స్థానికులు గ్రామస్తులు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ గౌస్ పంచనామ నిర్వహించారు. మృత‌దేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.